హోటల్లో హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించినందుకు ఓ మహిళ నుంచి రూ.1.10 లక్షల జరిమానా వసూలు చేశారు.
కెల్లీ ఆస్ట్రేలియాలోని 'నోవోటెల్ పెర్త్ లాంగ్లీ' అనే హోటల్లో తన వెంట తెచ్చుకున్న హెయిర్ డ్రయ్యర్ తో తలను ఆరబెట్టుకునింది.
అప్పుడు హెయిర్ డ్రయ్యర్ ఫైర్ అలారంను మోగించింది వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని హెయిర్ డ్రయ్యర్ ద్వారా అలారం మోగడంతో ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. అంతా అయిపోయిందని భావించిన కెల్లీకి అప్పుడే సమస్య మొదలైంది.
మూడు రోజుల తర్వాత కెల్లీ బ్యాంకు ఖాతా నుంచి రూ.1,10,000 కట్ అయ్యాయి. తప్పుడు ఫైర్ అలారం మోగించినందుకు జరిమానా కింద తీశారని తెలుసుకునింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రకరాం తప్పుడు అలారం మోగిస్తే విధించే జరిమానా కంటే ఎక్కువ వసూలు చేశారట.
అంత భారీ మొత్తాన్ని జరిమానాగా చెల్లించడానికి కెల్లీ ఇష్టపడలేదు. హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించిన కెల్లీ ఈ విధానం న్యాయమేనా అని ప్రశ్నించారు. ఈ సంఘటన మీడియా దృష్టిని ఆకర్షించడంతో, చివరికి తన డబ్బు తనకి తిరిగి ఇవ్వబడింది.
హోటళ్లు దేనికి అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయని మీరు అనుకుంటున్నారు... కామెంట్ లో చెప్పండి!