ఈ నెల 22న రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు కోట్లాది మంది రామభక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాంజానియా కంటెంట్ క్రియేటర్ అయినా కిలీ పాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. భారతీయ సినిమా పాటల ద్వారా మన దేశంలో ఫేమస్ అయిన కిలీ పాల్ ఇప్పుడు అయోధ్యను సందర్శించేందుకు ఉత్సాహంగా ఉన్నటూ ఓ వీడియోను షేర్ చేశారు.
'రామ్ సియా రామ్, సియారామ్ జై జై రామ్' అని పాటను పాడుతూ త్వరలో రామజన్మభూమిని సందర్శించాలని కోరుకుంటున్నట్లు ఓ వీడియోలో మాట్లాడి దాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో క్యాప్షన్‌లో ఇలా రాశారు, తనకి అయోధ్యకు రావాలని చాలా ఆశగా ఉన్నట్లు...రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలనుకుంటున్నాట్లు పేర్కొన్నారు. తనకు రాముడి ఆశీస్సులు కావాలి అంటూ 'జై శ్రీరామ్' అని క్యాప్షన్ రాశారు.
తన కోరికను చెప్పడం మాత్రమే కాకుండా ‘రామ్ సియా రామ్’ పాటను పాడుతూ అయోధ్యను సందర్శించడానికి ఆ శుభ సమయం కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. భారతదేశంలో మాత్రమే కాదు దక్షిణాఫ్రికాలోనూ శ్రీ రామ నామ స్మరణ మారు మ్రోగుతోందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఆ వీడియోకి వేలాది మంది భారతీయులు కిలీ పాల్ ని అయోధ్యకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ వీడియో వైరల్ గా మారింది.