Jadeja Instagram story about Dhoni.
Jadeja Instagram story about Dhoni.

మా జెర్సీ నెంబర్ లాగే నా ఇంస్టాగ్రామ్ స్ట్రాంగ్ అయ్యింది...7.8 మిలియన్ ఫాలోవర్స్ - జడేజా

ఇలాంటి స్టోరీ పెట్టడం కోసం 7.8 మిలియన్ ఫాలోవర్స్ రావడానికి జడేజా వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తుందని
Published on

MS ధోని మరియు రవీంద్ర జడేజా మధ్య ఉన్న స్నేహం గురించి మనకు తెలిసిందే…2012 నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని కెప్టెన్సీ లో ఆడుతున్నారు జడేజా. దాదాపు పది సంవత్సరాలు ధోని ఆధ్వర్యంలో జడేజా సి.ఏస్.కె లో ఆడుతున్నారు.

సర్ జడేజా బంతిని పట్టుకోవడానికి పరిగెత్తడు బంతి అతనిని వెతుకుని వచ్చి జడేజా చేతిలో పడుతుందని ధోని 2013లో ట్వీట్ కూడా చేశారు.

2019లో CSK Vs రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్ లో అయితే బెన్ స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్‌లో రవీంద్ర జడేజా సిక్స్‌ కొట్టి నేలపై పడతారు అది సిక్సర్ షాట్ అని తెలియకుండా ఆఫ్ - స్ట్రైక్ లో ఉన్న ధోని రన్ కోసం వస్తారు అప్పుడు...వేళ్ళు వేళ్ళు అని జడేజా కు సైగ చేసినా జడేజా నేలపైన పడుకొని గాల్లో ఉన్న బంతిని చూస్తుంటారు. అప్పుడు అది సిక్సర్ షాట్ అని గ్రహించిన ధోని తన బ్యాట్ తో ముద్దుగా జడేజా తల పై కొడతాడు. ఈ దృశ్యం ఇప్పటికి కూడా సోషల్ మీడియా చెక్కర్లు కొడుతోంది.

2022 CSK కెప్టెన్ గా జడేజాను నియమించినప్పుడు...అది జడేజా బ్యాడ్ టైమో ఏమో తెలియదు కానీ జడేజా కెప్టెన్ గా ఉన్నప్పుడు CSK టీమ్ పెద్దగా పెర్ఫార్మ్ చెయ్యలేకపోయింది. ఇక కెప్టెన్సీ మళ్లీ ధోని చేతికి వెళ్ళింది. ఆ సీజన్ పూర్తయిన తర్వాత జడేజా CSK కి సంబంధించిన పోస్ట్ లను తన సోషల్ మీడియా ఖాతా నుండి తొలగించడంతో నెటిజన్లు ఇక జడేజా CSK టీమ్ లో ఆడారని నిర్ణయించుకున్నారని అనుకోవడం మొదలు పెట్టేసారు. CSK మరియు జడేజా మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా విచ్ఛిన్నమైనప్పుడు అతను ఫ్రాంచైజీని విడిచిపెట్టడం దాదాపు ఖాయం.

అనే సమయంలో ధోనీ జోక్యం చేసుకుని జడేజా లాంటి ఆటగాడిని టీమ్ నుండి విడువలేమని స్పష్టం చేశారు. అతను అన్ని అపార్థాలను పరిష్కరించారు మరియు జడేజా 2023లో CSK కోసం ఆడేలా చూసారు.

ఇక ది రెస్ట్ ఐస్ హిస్టరీ అన్నట్లు 2023 IPL కప్ ను జడేజా కెప్టెన్ ధోని చేతిలో పెట్టారు. చెన్నై లో CSK ఆడే మ్యాచ్ లో జడేజా క్రీజ్ కి వస్తే ఔట్ అవ్వాలని కోరుకున్న ఫాన్స్ దగ్గరే తిరిగి జడేజా ఎలాగైనా CSK ని గెలిపించాలని ప్రార్ధించేటట్టు చేశారు జడేజా. ఇక చివరి బంతిలో నాలుగు రన్ లు కొట్టి CSK ని ఐదవ సారి IPL కప్ ఎత్తుకునేలా చేశారు జడేజా...ఇక ఆ నాలుగు రన్ కొట్టిన వెంటనే బ్యాట్ తో గ్రౌండ్ లో పరిగెత్తుకుంటూ తన టీం దగ్గరికి వెళ్లిన జడేజాను ధోని ఎత్తుకొని ఎమోషనల్ అవ్వడం చూసి ఫాన్స్ కూడా కంట తడి పెట్టుకున్నారు. ఆ మూమెంట్ లో తీసిన ఫోటోనే జడేజా తన ఇంస్టాగ్రామ్ డీపీగా పెట్టుకుని ఉన్నారు…ఇంత బలమైన స్నేహం వీరి మధ్యలో ఉంది.

అయితే ఇప్పుడు జడేజాకి ఇంస్టాగ్రామ్ లో 7.8 మిలియన్ ఫాలోవర్స్ రావడంతో జడేజా ఒక స్టోరీ పోస్ట్ చేశారు… టీమ్ గా పని చేస్తే కల నెరవేరుతుంది. ఇప్పుడు మా జెర్సీ నెంబర్ లాగా నా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ స్ట్రాంగ్ అయ్యారు (ధోని జెర్సీ నెంబర్ 7 జడేజా జెర్సీ నెంబర్ 8) ఇప్పుడు జడేజా ఫాలోవర్స్ 7.8 మిలియన్ కావడంతో ధోని ఇంకా జడేజా జెర్సీ నెంబర్ లాగా తన ఫాలోవర్స్ కౌంట్ ఉండటంతో జడేజా ఇలా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఇక...ఇలాంటి స్టోరీ పెట్టడం కోసం 7.8 మిలియన్ ఫాలోవర్స్ రావడానికి జడేజా వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరైతే ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి స్నేహ బంధం ఉండాలని ఆశ పడుతున్నారు ఏ మాటకి ఆ మాట ఏదో ఒక రకంగా ధోనీపై తనకున్న అభిమానాన్ని జడేజా నిరూపిస్తూనే ఉన్నారు.

Vikatan Telugu
telugu.vikatan.com