ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటిస్తోంది.
హైదరాబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫిబ్రవరి 2న విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరిస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ ఆడలేదు.
వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే, విరాట్ కోహ్లీ తల్లి అనారోగ్యంతో ఉందని, అందుకే విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి తప్పుకున్నాడని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అనవసరమైన పుకార్లను వ్యాప్తి చేయవద్దని విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రజలను కోరారు.
'నా తల్లి ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆమె బాగానే ఉన్నారు. ప్రజలు, మీడియా దుష్ప్రచారం చేయొద్దన్నారు.