Kesineni nani and Jagan mohan reddy
Kesineni nani and Jagan mohan reddy

చంద్రబాబు పచ్చి మోసగాడు.. జగన్‌ పేదల పక్షపాతి - కేశినేని నాని!

నన్ను చెప్పుతో కొడతానని మనుషులని పెట్టి తిట్టించిన భరించాను...గొట్టం గాడు అన్నా కూడా భరించాను...ఇంకెన్ని అవమానాలు పడాలి..? చంద్రబాబు పచ్చి మోసగాడు.. జగన్‌ పేదల పక్షపాతి - టీడీపీని వీడుతూ కేశినేని నాని చెప్పిన వ్యాఖ్యలు.
Published on

బుధవారం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన కేశినేని నాని...అనంతరం మీడియాలో మాట్లాడారు.

2013 జనవరి నుంచి టీడీపీ అభివృద్ది కోసం పని చేస్తూ వచ్చానని నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం కష్టపడిన తీరు అందరికీ తెలుసని.. 2014 ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను పని చేశానని గుర్తు చేశారు. కొంతమందికి ఆ రోజు నెలవారీ జీతాలు కూడా తన చేతుల మీదుగా ఇచ్చినట్లు...తన సొంత వ్యాపార సంస్థ కన్నా...టీడీపీ గెలుపే ముఖ్యంగా భావించానని చెప్పారు. ఈ పార్టీ కోసం నువ్వు ఎందుకు ఇంత శ్రమిస్తావని నా సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా అన్నారు.

2019 ఎన్నికలలో నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు ఆ తర్వాత నేను ఎంపీగా ఇక్కడ విజయవాడలో గెలిచి ప్రజల అభిమానాన్ని పొందాను. ఆయనకీ పార్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు రిసోర్సెస్ అన్ని ఇచ్చారు పార్టీ అంతరంగం అంత ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు. నేను చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నేను గెలిచాను...ఆపై వారి మనుషులను పెట్టి.. నన్ను చాలా అవమానపరచడం జరిగింది.

Nara lokesh and kesineni nani
Nara lokesh and kesineni nani

మేయర్ ఎన్నికలు వచ్చిన సమయంలో మేయర్ సీట్ లేడీ అయినప్పుడు చంద్రబాబు నాకు ఫోన్ చేసి కార్పొరేషన్ ఎలక్షన్ కి ఎం చేయబోతున్నావు అని అడిగారు...నేను దానికి ఇంఛార్జిలు ఇష్టం అని చెప్పాను. బోండా ఉమా గారి భార్యని పెడుతున్నారా...అదే జరిగితే చాలా ప్రమాదకరం అని చంద్రబాబు చెప్పారు. ఈ నిజాన్ని ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ చెప్పలేదు...ఆ తర్వాత నా కుటుంబం నుంచి ఒకరు ఉంటే బాగుంటుందని నన్ను బలవంతం చేశారు. టాటా సంస్థల్లో పని చేస్తున్న నా కుమార్తె శ్వేతను జాబ్ రాజీనామా చేయించి మరీ పోటీ చేయించాను. ఎన్నికల సమయంలో కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి...ప్రెస్ మీట్ లో పబ్లిక్ గా నన్ను తిట్టించారు...ఎంపీ కేశినేని నానిని చెప్పు తీసుకుని కొడతాను అని ఒక క్యారెక్టర్ లెస్ పర్సన్ తో చెప్పించారు చంద్రబాబు నాయుడు. పార్టీ నుంచి ఈ విమర్శలపై కనీసం స్పందన లేదు. మళ్ళీ అదే ప్రెస్ మీట్ లో ఒక పొలిట్ బ్యూరో సబ్యుడు నన్ను గొట్టం గాడు అన్నాడు అయినా స్పందన లేదు. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్ల చెదురు అయిపోయింది.

kesineni nani's daughter swetha.
kesineni nani's daughter swetha.

ప్రచారానికి రావద్దని చంద్రబాబు నాకే చెప్పారు. సిట్టింగ్ ఎంపీ లేకుండా...కార్పొరేషన్ ఎలక్షన్స్ లో నా కూతుర్ని నించోబెట్టి నా డబ్బులు ఖర్చుబెట్టుకొని నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన. నన్ను తిట్టిన వ్యక్తులతో చంద్రబాబు ప్రచారం చేశారు. రాబిన్ శర్మ టీమ్ వచ్చి ఐదు సీట్లు కన్నా ఎక్కువ రావడం లేదని చెప్పగానే నేను చూసుకుంటాను అని దైర్యంగా ముందుకు అడుగు వేసాను పార్టీ డబ్బుతో ఎటువంటి సంబంధం లేకండా... నా సొంత డబ్బుతో నేను గెలిపించాను. ఒక పార్టీ అధ్యక్షుడు...ఒక పార్టీ ఎంపీని రావద్దంటే భరించా...నన్ను చెప్పుతీసుకుని కొడతా అని మనుషులని పెట్టి తిట్టిపిస్తే భరించా గొట్టంగాడు అన్నా భరించా...పార్టీలో ఉంటూ ఎన్ని అవమానాలు నేను పడాలి..? మీకు ఇష్టం లేకపోతే నేనే తప్పుకుంటానని చంద్రబాబుకి చెప్పాను. ముఖ్య నాయకుల ముందే...నువ్వే ఉండాలని నాకు చెప్పారు. నువ్వే ఎంపీగా ఉంటేనే.. పార్టీకి మంచి జరుగుతుందని అని కూడా ఆయన చెప్పారు." అని ఎంపీ కేశినేని అన్నారు.

చివరికి టీడీపీ పార్టీ నుండి రాజీనామా చేసి సీఎం జగన్ ని కలిసిన తర్వాత మీడియా ముందు చంద్రబాబు నాయుడు పచి మోసగాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి ఆయన. జగన్ మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి నిరుపేదల పక్షపాతి అని టీడీపీని వీడుతూ కేశినేని నాని చెప్పారు.

Vikatan Telugu
telugu.vikatan.com