డీఎంకే కూటమిలో చేరిన కమల్ హాసన్ పార్టీలో ఒకరికి స్టార్ క్యాంపెయినర్, మరొకరికి రాజ్యసభ సీటు!

నేను, నా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, అయితే ఈ కూటమికి అన్ని విధాలా సహకరిస్తాం ఇది కేవలం పదవి కోసం కాదు దేశం కోసం.
డీఎంకే కూటమిలో చేరిన కమల్ హాసన్ పార్టీలో ఒకరికి స్టార్ క్యాంపెయినర్, మరొకరికి రాజ్యసభ సీటు!
Published on

నటుడు కమల్‌ హాసన్‌ నేతృత్వంలోని రాజకీయ పార్టీ మక్కల్‌ నీది మైయం (MNM - మక్కల్ నీది మయ్యాం) శనివారం తమిళనాడులో అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం కూటమి MNMకి తన మద్దతును అందించింది. పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కమల్ హాసన్ పార్టీకి సీట్లు కేటాయించవచ్చనే ఊహాగానాల మధ్య, డీఎంకే 2025 రాజ్యసభ ఎన్నికల కోసం MNMకి ఒక స్థానాన్ని కేటాయించడం జరిగింది.

చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో కమల్ హాసన్, డీఎంకే అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రైనా ఎంకే స్టాలిన్ మధ్య ఒప్పందం కుదిరింది. నేను, నా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు...అయితే ఈ కూటమికి అన్ని విధాలా సహకరిస్తాం...ఇది కేవలం పదవి కోసమే కాదు, దేశం కోసం చేతులు కలిపామని కమల్ హాసన్ అన్నారు. MNM కూటమికి తన పూర్తి మద్దతును ప్రకటించింది ఇక తమిళనాడు మరియు పుదుచ్చేరి సెగ్మెంట్‌లోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో ప్రచార సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొంటుంది.

Trending

No stories found.
Vikatan Telugu
telugu.vikatan.com