ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు 3 కేసుల్లో బెయిల్ మంజూరైంది!

ఒకేసారి మూడు కేసుల్లో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.
TDP leader N. Chandrababu Naidu.
TDP leader N. Chandrababu Naidu.
Published on

గతేడాది నవంబర్‌లో హైకోర్టు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ (TDP) అధినేతకు బెయిల్ మంజూరు చేసింది.

ప్రస్తుతం మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఇసుక పాలసీ ఇంకా మద్యం ఈ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని AP CID నమోదు చేసిన కేసులకు చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే హైకోర్టు నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మూడు కేసులకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తూ...విచారణకు సహకరించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇకపోతే ఈ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగ సభలు కానీ మీడియా వేదికలపై కానీ ఎక్కడా కూడా ప్రస్తావించకూడదని ఆదేశించింది.

Trending

No stories found.
Vikatan Telugu
telugu.vikatan.com