అయోధ్య సరయు నది ఒడ్డున నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం నిన్న ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పూర్తయింది. ఇదిలా ఉండగా ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజాబాద్ నగరానికి చెందిన ఫర్జానా అనే ముస్లిం మహిళా సోమవారం తన బిడ్డకు జన్మనిచ్చింది. ఆలయ ప్రారంభోత్సవ రోజున బిడ్డ జన్మించడం వల్ల శిశువుకు రామ్ రహీమ్ అని పేరు పెట్టారు.
ఫర్జానా అనే మహిళ సోమవారం మగబిడ్డకు జన్మనిచ్చినట్లు జిల్లా మహిళా ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ డా. నవీన్ జైన్ తెలిపారు. బిడ్డ మరియు తల్లి ఇద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్ చెప్పారు.
పిల్లవాడి అమ్మమ్మ హుస్నా బాను బిడ్డకు "రామ్ రహీమ్" అని పేరు పెట్టారు. హిందూ-ముస్లింల ఐక్యత సందేశం ఇచ్చేందుకే బిడ్డకు రామ్ రహీమ్ అని పేరు పెట్టినట్లు హుస్నా బాను తెలిపారు.