"నాకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు మా అమ్మ చెప్పింది ఇదే!" - ఎ.ఆర్.రెహమాన్
సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఇటీవల 'ఆక్స్ ఫర్డ్ యూనియన్ టిబెట్ సొసైటీ' విద్యార్థులతో ఓ కార్యక్రమం ద్వారా ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యువతలో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయన్నారు. "నాకు చిన్నతనంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయి. ఆ సమయంలో మా అమ్మ నాతో 'నువ్వు ఇతరుల కోసం జీవిస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఉండవు' అని చెప్పేది. అదే ఆయన నాకు ఇచ్చిన అద్భుతమైన సలహా.
మీరు ఇతరుల కోసం జీవించినప్పుడు మీరు స్వార్థపరులుగా ఉండరు. మీ జీవితం అర్ధవంతంగా ఉంటుంది. సంగీతం సమకూర్చేటప్పుడు, రాసేటప్పుడు, ఆహారం లేనివారికి తినిపించేటప్పుడు నేను ఈ మాటని తలుచుకుంటాను . అదే మనల్ని నడిపిస్తుంది.
భవిష్యత్తు గురించి మనం పెద్దగా అంచనా వేయలేం. కానీ ఏదో అద్భుతం మీ కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి ఆలోచనలు, నమ్మకాలే నన్ను నడిపిస్తున్నాయి.
ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా కష్టమైన రోజులు ఉంటాయి. ఈ లోకంలో మన ప్రయాణం చాలా చిన్నది. మనమందరం పుట్టి, కొంతకాలం జీవించి, ఆ తర్వాత ఇక్కడి నుండి వెళ్లిపోతాం. మనం ఎక్కడికి వెళ్లబోతున్నాం అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. ఇది వారి వ్యక్తిగత నమ్మకాలు మరియు కల్పనలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ శాశ్వతత్వం అనేదే లేదని ఖచ్చితంగా చెప్పగలం.