స్టార్ హీరో కమల్ హాసన్ పై చిన్మయి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది!

సమాజంలో మహిళలకు జరిగే అన్యాయాలను చిన్మయి ప్రశ్నిస్తారు...ఎవ్వరికి భయపడదు. ఇటీవల చిన్మయి స్టార్ హీరో కమల్ హాసన్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్మయి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్టార్ హీరో కమల్ హాసన్ పై చిన్మయి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది!
Published on

సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సమాజంలో మహిళలకు జరిగే అన్యాయాల్ని ఎపుడూ చిన్మయి ప్రశ్నిస్తారు ఇటీవల చిన్మయి స్టార్ హీరో కమల్ హాసన్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కమల్ హాసన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చిన్మయి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2018లో చిన్మయి గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతనిపై ఆమె చెప్పిన ఆరోపణలు నిజం కాదంటూ ఆమెకు ఐదేళ్ల పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి నిషేధం విధించారు. దీనిపై విమర్శలు చేస్తూనే ఉంది చిన్మయి. అయితే ఇప్పుడు ఒక కొత్త తీయటీ చేశారు అది ఏమిటంటే...

గీత రచయిత వైరముత్తు రచించిన ‘మహా కవిత' పుస్తకావిష్కరణ ఇటీవల గ్రాండ్ గా జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, కమల్ హాసన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దీన్ని చిన్మయి ఖండించారు. మహిళలను వేధించిన వారికి సపోర్ట్ గా పెద్ద మనుషులు ఉన్నారు అనే రకంగా ఆమె ట్వీట్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పుస్తకావిష్కరణ కార్యక్రమం గురించి ప్రముఖ టీవీ ఛానెల్ ట్వీట్ చేసింది. దీన్ని చిన్మయి రీట్వీట్ చేశారు. నన్ను వేధించిన వ్యక్తికి తమిళనాడులోని కొందరు శక్తివంతమైన వ్యక్తులు మద్దతు ఇస్తున్నారని ఆమె ఆరోపించింది.

Trending

No stories found.
Vikatan Telugu
telugu.vikatan.com