బాస్ తో మాత్రమే కాదు లిటిల్ బాస్ తో కూడా సినిమా చెయ్యాలని వెయిట్ చేస్తున్నాను - సందీప్ రెడ్డి వంగా!

స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫేవరెట్ హీరో మెగా స్టార్ చిరంజీవి అన్న విషయం మనకు తెలిసిందే...అయితే రీసెంట్ గా మెగా స్టార్ తో మాత్రమే కాదు లిటిల్ బాస్ మెగా పవర్ స్టార్ తో కూడా సినిమా తీయాలని వెయిట్ చేస్తున్నట్లు సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.
Sandeep Reddy Vanga and Ram charan
Sandeep Reddy Vanga and Ram charan
Published on

అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టి విజయ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి ఆ ఇండస్ట్రీ లో కూడా భారీ హిట్ కొట్టారు వంగా. అర్జున్ రెడ్డి సినిమా అయితే యూత్ లో భారీ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది.

Arjun Reddy and Kabir Singh movies.
Arjun Reddy and Kabir Singh movies.

మరీ ఈ రెండు చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకున్న సందీప్. గత ఏడాది యానిమల్ మూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేశారు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీతో మరోసారి డైరెక్టర్ సందీప్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.

Animal movie
Animal movie

సందీప్ తర్వాతి చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. పేరు స్పిరిట్ అని ప్రకటించారు. 'స్పిరిట్' ప్రభాస్ 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక ప్రభాస్ ఆ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేయనున్నారని తెలిసిన తర్వాత సినిమాకి మరింత హైప్ పెరిగింది. 2023 లోనే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించేసాము ఇక సినిమా షూటింగ్ అయితే 2024 సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.

Spirit movie
Spirit movie

ఇక ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. స్పిరిట్ మూవీ పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు.

Allu arjun's movie with sandeep reddy vanga.
Allu arjun's movie with sandeep reddy vanga.

ఈ రెండు చిత్రాలను వంగా ప్రొడక్షన్ అయినా భద్రకాళి పిక్చర్స్ మరియు భూషణ్ కుమార్ ఫిల్మ్ స్టూడియో, మ్యూజిక్ లేబుల్ అయినా టి-సిరీస్ కలిసి నిర్మించనున్నాయి. కుమార్ మరియు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, శివ చనన సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

వీరిద్దరే కాకుండా తన ఫేవరేట్ హీరోతో సినిమా చేయాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టారు వంగా. తన ఫేవరెట్ హీరో మెగా స్టార్ చిరంజీవి అన్న విషయం మనకు తెలిసిందే...ఆపై తన ఫెవరెట్‌ హీరో చిరు కుమారుడైన రామ్‌ చరణ్‌ తో కూడా సినిమా చేయలాని అనుకుంటున్నారట.

రీసెంట్‌గా మహబూబాబాద్ జిల్లా... దంతాలపల్లికి వెళ్లిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అక్కడ తన ఆత్మీయులతో తన మనసులోని మాటను పంచుకున్నారట. బాస్ మెగాస్టార్‌ చిరంజీవితో మాత్రమే కాదు... లిటిల్ బాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తో కూడా… సినిమా తీసేందుకు వెయిట్ చేస్తున్నా అంటూ... ఓపెన్ అయ్యారు. ప్రస్తుతం ఈ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు వంగా.

ఇక ఈ మూవీ ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో వెయిట్ చేసి చూద్దాం.

Trending

No stories found.
Vikatan Telugu
telugu.vikatan.com