త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా గుంటూరు కారం సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీ లీల నటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో నిన్న ఈ సినిమా ప్రీ - రిలీజ్ ఈవెంట్ గుంటూరులో అంగ రంగ వైభవంగా జరిగింది. బాబు ప్రతిసారి తనతో నటించిన హీరోయిన్ల గురించి ఆడియో లాంచ్ లో లేదా ప్రీ - రిలీజ్ ఈవెంట్ లో మర్చిపోతారు అయితే ఈ సారి మాత్రం శ్రీ లీల గురించి మాట్లాడటానికి మర్చిపోలేదు...కంగారు పడకమ్మా మర్చిపోవట్ల...నీ గురించే మాట్లాడుతున్న అని పంచ్ వేసి మరీ మొదలు పెట్టారు మహేష్ బాబు. "చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి పెద్ద హీరోయిన్ అవ్వడం. నేను వర్క్ చేసిన హీరోయిన్లలో శ్రీ లీల చాలా డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ అని కూడా చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయికి shot ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటాది make - up van లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్ కి కానీ శ్రీ లీల అంటే చాలా ఇష్టం. ఈ అమ్మాయితో డాన్స్ వెయ్యటం వామ్మో..అదేం డాన్స్ అండి...హీరోలందరికీ తాట ఊడిపోద్దని శ్రీ లీల డాన్స్ అండ్ ఎనర్జీని పొగడ్తలతో ముంచేతేసాడు.
శ్రీ లీల డాన్స్ గురించి అసలు ఎంత మాట్లాడిన తక్కువే...కుర్చీ మడతపెట్టి సాంగ్ లో డాన్స్ ఇరగదీసింది శ్రీ లీలకి నేనేమి తక్కువ కాదన్నట్టు బాబు కూడా డాన్స్ కుమ్మేసాడు. ఇక ఈ డాన్స్ ని థియేటర్లో చూడటానికి ఫాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు!