నేను జోక్ చేయడం లేదు, నేను సీరియస్ గానే చెప్తున్నాను'- విజయ్ సేతుపతి మాటలకి సిగ్గుపడిన కత్రినా కైఫ్!

'కత్రినా కైఫ్ తో కలిసి పనిచేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. నేను కత్రినా వీరాభిమానిని' - విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్
Published on
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్, రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మేరీ క్రిస్మస్' .

హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ సినిమా ప్రెస్ మీట్ నిన్న ముంబైలో జరిగింది. నటుడు విజయ్ సేతుపతి కత్రినాను పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. 

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్

కత్రినా గురించి విజయ్ సేతుపతి మాట్లాడుత... కత్రినా కైఫ్ తో కలిసి నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను కత్రినా వీరాభిమానిని. ఆమె అందగత్తె మాత్రమే కాదు ఆలోచనాత్మక నటి కూడా! మంచి కథలను ఎంచుకుంటూ వస్తున్న తన ఆలోచనా విధానం, టాలెంట్, ఎనర్జీనే ఆమెను ఇన్నాళ్లూ ఈ స్థానంలో నిలబెట్టాయి. ఒక సన్నివేశం బాగా రావాలంటే... దాని కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాది. ఆమె చాలా డెడికేటెడ్!"

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్

విజయ్ సేతుపతి కత్రినాను పొగుడుతూనే ఉండగా నవ్వుతూ సిగ్గుపడింది. విజయ్ సేతుపతి "నేను జోక్ చేయడం లేదు,  సీరియస్ గా చెబుతున్నాను" అని బదులిచ్చాడు.  ప్రస్తుతం ఈ వీడియోకు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి.

Trending

No stories found.
Vikatan Telugu
telugu.vikatan.com