'లియో' తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ తన 68వ చిత్రంలో నటిస్తున్నారు.
ఏజీఎస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. శరవేగంగా షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమైయ్యారు ఈ సినిమాను విదేశాల్లో కూడా షూట్ చేయనున్నట్లు సమాచారం. వచ్చే న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను విడుదల చేయనున్నట్లు కూడా సమాచారం.
ఇదిలా ఉంటే విజయ్ 68వ సినిమాకు బాస్ (లేదా) పజిల్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత అర్చన కల్పాతి తన 'ఎక్స్' వెబ్ సైట్ లో ఓ ట్వీట్ చేశారు. 'అన్ని అప్డేట్స్ చూశాను. మీ ప్రేమకు ధన్యవాదాలు. వెంకట్ ప్రభు చాలా స్పెషల్ గా తయారు చేస్తున్నారు.
అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాలి. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు. కానీ దళపతి 68 టైటిల్ బాస్ (లేదా) పజిల్ కాదు.