Amitabh Bachchan buys land in Ayodhya.
Amitabh Bachchan buys land in Ayodhya.

అయోధ్యలో భూమి కొనుగోలు చేసిన అమితాబ్ బచ్చన్!

రామ్ మందిరానికి 15 నిమిషాల దూరంలో భూమి కొనుగోలు చేసిన అమితాబ్ బచ్చన్. ప్రపంచ ఆధ్యాత్మిక నగరంలో ఇల్లు నిర్మించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
Published on

అయోధ్య‌లో రామ్‌ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రముఖులకు స్వయంగా ఆహ్వానం పంపించారు. అయోధ్య మొత్తం రామ నామంతో మారుబోగనుంది.

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవలే అయోధ్యలో ఇంటి కోసం స్థలాన్ని కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలపర్ ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) ద్వారా అయోధ్యలోని 7-స్టార్ మిక్స్డ్ యూజ్ ఎన్‌క్లేవ్ అయిన ది సరయులో బచ్చన్ ఆస్తిని పొందినట్లు నివేదించబడింది. 10,000 చదరపు అడుగుల భూమిని రూ.14.5 కోట్లకు అమితాబ్ కొనుగోలు చేశారు. ఇతర వివరాలను గోప్యంగా ఉంచారు.

తన హృదయంలో ప్రత్యేక స్థానం కలిగిన అయోధ్యలో భూమి కొనుగోలు చేసానని. అయోధ్య ఆత్మలోకి ప్రయాణం ప్రారంభమైంది. సంప్రదాయం, ఆధునికత కలిగిన నగరంలోకి అడుగు పెట్టాను. ప్రపంచ ఆధ్యాత్మిక నగరంలో ఇల్లు నిర్మించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని అమితాబ్ బచ్చన్ తెలిపారు.

అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన భూమి రామ మందిరానికి 15 నిమిషాల దూరంలో ఉంటుంది. అక్కడినుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 30 నిమిషాల సమయం పడుతుంది.

Vikatan Telugu
telugu.vikatan.com