ఆమిర్ ఖాన్ చేతిలో మెహందీ...ఆమిర్ ఖాన్, కూతురు ఇరా ఖాన్!

ఈ ఫోటోల్లో ఆమిర్ తన చేతిపై మెహందీని ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారు. ఆయన కుమార్తె మణికట్టుపై టాటూ కూడా ఉంది. 'సన్, స్టార్ అండ్ మూన్' అంటూ కూతురి చేతిపై ఉన్న టాటూ మాదిరిగానే అమీర్ తన చేతికి మెహందీ పెట్టుకున్నారు.
అమీర్ ఖాన్, కూతురు ఇరా ఖాన్
అమీర్ ఖాన్, కూతురు ఇరా ఖాన్ @khan.ira
Published on

అమీర్ ఖాన్ మెహందీ పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

@khan.ira

అమీర్ ఖాన్, రీనా దత్తా దంపతుల కుమార్తె ఇరా ఖాన్ కు ఫిట్నెస్ కోచ్, కన్సల్టెంట్, అథ్లెట్ అయిన నుపుర్ శిఖారేతో పెళ్లి జరిగింది. ఇరా ఖాన్ మరియు నుపుర్ శిఖారే ప్రేమించుకున్నారు.   

ఇరా ఖాన్ ఇటీవల తన ప్రియుడు నుపుర్ శిఖారేను జనవరి 10న వివాహం చేసుకుంది. జనవరి 3న ముంబైలో రిజిస్టర్డ్ మ్యారేజ్ వేడుక జరిగింది. ఈ జంట ఉదయ్ పూర్ లో వైట్ వెడ్డింగ్ జరిగింది.  

@khan.ira

తాజాగా ఇరా ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. మొదటి రెండు ఫోటోల్లో ఆమిర్ చేతిలో మెహందీని ప్రదర్శిస్తూ కనిపించారు. ఆయన కుమార్తె మణికట్టుపై టాటూ కూడా ఉంది. 'సన్, స్టార్ అండ్ మూన్' అంటూ కూతురి చేతిపై ఉన్న టాటూ మాదిరిగానే అమీర్ తన చేతికి మెహందీ పెట్టుకున్నారు.

మూడో ఫొటోలో అమీర్ ఇరా బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.   

Trending

No stories found.
Vikatan Telugu
telugu.vikatan.com