బొద్దింకను చంపడానికి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి - ఏం జరిగింది? ట్విట్టర్
అంతర్జాతీయం

బొద్దింకను చంపడానికి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి - ఏం జరిగింది?

బొద్దింక చనిపోయిందా అంటూ పలువురు నెటిజన్లు ఈ ఘటనపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Telugu Editorial

బొద్దింకను చూడగానే మనలో చాలా మంది భయంతో పారిపోతారు, కానీ ఇక్కడ మాలో ఒకరు ఇంటికి నిప్పు పెట్టారు

జపాన్ లోని కుమామోటో నగరంలో నివసిస్తున్న ఓ వ్యక్తి తన అపార్ట్మెంట్ లో బొద్దింకను కనుగొన్నాడు.

దీంతో భయపడి ఎలాగైనా చంపేయాలని భావించాడు. బొద్దింకను చంపాలనే ఉద్దేశంతో ఇల్లంతా పురుగుల మందు పిచికారీ చేశాడు.

కానీ భయంలో ఎం చేస్తున్నాడో తెలియకుండా విద్యుత్ లైన్ దగ్గర కూడా పురుగుల మందు పిచికారీ చేశాడు. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. మంటల్లో ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఈ ఘటనపై పలువురు నెటిజన్లు సరదాగా బొద్దింక చనిపోయిందా..?అని కామెంట్లు చేస్తున్నారు.