Wedding Photoshoot in Hyderabad RTC Bus. 
ట్రెండింగ్

ఆర్టిసి బస్సులో వెడ్డింగ్ ఫోటోషూట్!

Meenakshi Gopinathan

సినిమాల ప్రభావమో లేక వీళ్ళే కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారా...ముందంతా పెళ్లంటే మనకి గుర్తుకు వచ్చేది పెళ్లి భోజనం, వధువు ఇంకా వరుడు కొత్త దుస్తులు, పెళ్లిలో బంధుమిత్రులతో కలిసి చేసే సందడి ఇవే గురుతుకు వస్తాయి కానీ ఇప్పుడు పెళ్లి అంటేనే మనకు ఫస్ట్ మైండ్ లోకి వచ్చేది ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ లే. ఈ ప్రీ - వెడ్డింగ్ ఫోటోషూట్లపై వధువు వరుడు ఆసక్తి చూపిస్తూ.. లక్షలు పెట్టి మరీ ఆ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఈ ఫోటోషూట్కనీ రకరకాల థీమ్ లు, దానికి తగ్గ దుస్తులు, లొకేషన్లు...పాటలు అంటు ఫోటోషూట్ ని సినిమా రేంజ్ కి తీస్తున్నారు. కొందరైతే పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఏకంగా హనీమూన్ వెళ్ళేటప్పుడు కూడా కెమరామెన్ ని వెంట పెట్టుకుని వెళ్లి అక్కడ వివిధ టూరిస్ట్ లొకేషన్ లో ఫోటోషూట్ చేస్తున్నారు.

Wedding

సినిమాలకు తామేమి తక్కువ కాదు అని నిరూపించుకునేందుకు భారీ స్థాయిలో షూట్ చేస్తున్నారు. అయితే...ఇందుకోసం ఎంచుకుంటున్న లొకేషన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక జంట వాళ్ళ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఆర్టీసీ బస్సును కూడా వదలకుండా వాడేశారు. ఆ ఫోటోషూట్ కి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఆ వీడియోలో అమ్మాయి ఆర్టీసీ బస్సు నుంచి దిగుతుండగా...వెనక నుండి అబ్బాయి ఆమెను ఫాలో అవుతున్నట్లు వీడియో షూట్ చేశారు. ఈ వీడియో సోషల్ మేడిలో హల్ చల్ చేస్తోంది.

ఐడియా మరియు వీడియో బాగుందని కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా...ఆర్టీసీ బస్సులో ఫొటోషూట్ చేయడమేంటని కొందరు నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. మీ పర్సనల్ వీడియో షూట్‌ల కోసం ఆర్టీసీ బస్సులను వాడటం వల్ల...ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, రోడ్డు భద్రతకు ఆటంకం కలుగుతోందని కామెంట్స్ పెట్టారు దీనికి రిప్లై ఇచ్చే విధంగా కొందరు...నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యల్లో ఇది అంత పెద్ద సమస్యేమీ కాదని చెప్తున్నారు మరి కొందరు ఆ ట్రాఫిక్ వల్ల పడే ఇబ్బందులు చాలక వీళ్ళ ఫోటోషూట్ కారణంగా మళ్లీ మేము ఇబ్బంది పడాలా అని ప్రశ్నిస్తున్నారు...మరికొందరైతే క్రమశిక్షణ సమస్య ఉత్పన్నం అవుతుందని అభిప్రాయ పడుతున్నారు. కొత్త జంట క్యూట్‌గా ఉందని కొందరు...ఇలా వివిధ రకాల కామెంట్స్ తో వీడియోని ముంచెత్తారు. అయితే వీళ్ళు తమకు తోచింది చేసి సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఇలా చేస్తున్నారా లేకపోతే ప్రజల మధ్య ట్రెండ్ అయ్యి గుర్తింపుకోసం ఆరాటపడుతున్నారా అనేది వాళ్ళకే తెలియాలి.