Harshith Rana & Mayank Agarwal 
స్పోర్ట్స్

ఫ్లైయింగ్ కిస్ సెలబ్రేషన్ చేసి FINE కు గురైయ్యాడు!

నిన్న ఈడెన్ గార్డెన్స్ లో( మార్చ్ 23) జరిగిన KKR Vs SRH మ్యాచ్ లో హర్షిత్ రాణా మయాంక్ అగర్వాల్ వికెట్ తీసిన తర్వాత చేసిన సెలబ్రేషన్ ఈ FINE కు దారితీసింది.

Meenakshi Gopinathan

కోల్‌కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. పేసర్ హర్షిత్ రాణా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో మొత్తం 60 శాతం జరిమానా విధించారు. పవర్ ప్లేలో SRH బాట్స్మన్ మయాంక్ అగర్వాల్ వికెట్ తీసిన KKR పేసర్ హర్షిత్ రాణా సెలెబ్రేషన్స్ లో భాగంగా మయాంక్ ను చూసి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు ఆ ప్రవర్తన IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించాడు, ఫలితంగా అతనికి జరిమానాలు విధించబడ్డాయి.

Harshith Rana & Mayank Agarwal