Y.S. Sharmila met N. Chandrababu Naidu. 
రాజకీయాలు

చంద్రబాబు నాయుడుని కలిసిన Y. S. షర్మిల...ఇది ఏమి వింత కాదు విచిత్రం కాదు!

చంద్రబాబు గారు ఒక తెలుగు దేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు...ఉండకూడదు...ఉండబోవు కూడా!

Meenakshi Gopinathan

YSR తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో వీలనం చేసిన షర్మిల చంద్రబాబు నాయుడుని కలిశారు. అయితే ఈ మీటింగ్ రాజకీయ పరంగా కచ్చితంగా కాదు ఇది ఒక ఫ్రెండ్లీ మీటింగ్ అని షర్మిల తేల్చేశారు. ఈ నెల 18న షర్మిల కుమారుడు Y. S. రాజా రెడ్డికి అట్లూరి ప్రియతో నిశ్చితార్థం జరగనుంది. వచ్చే ఫిబ్రవరి 24న వివాహం జారబోతున్న కారణంగా చంద్రబాబు గారిని ఆహ్వానించడానికి వచ్చినట్లు తెలిపారు.

ఇక షర్మిల ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ...పెళ్ళికి ఆహ్వానం ఇవ్వడానికి మాత్రమే వచ్చాను...ఇది పొలిటికల్ మీటింగ్ కాదు..చంద్రబాబు గారు ఒక తెలుగు దేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు...ఉండకూడదు..ఉండబోవు కూడా. రాజశేఖర్ రెడ్డి గారు కూడా తన పిల్లల పెళ్ళికి చంద్రబాబు గారిని ఆహ్వానించడం జరిగింది...చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది మెమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది...ఇది ఏమి వింత కాదు విచిత్రం కాదు కాబట్టి దీని ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో చుడండి అని తెలిపారు. ఇక కొన్ని రోజులకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పెళ్లి ఆహ్వానించడం జరిగింది.

Y.S. Sharmila met Revanth Reddy.