TDP leader Venkateswara Rao Buddha congratulated Rayudu for leaving YSRCP. 
రాజకీయాలు

కక్ష సాధించే జగన్ కు BYE...BYE చెప్పిన రాయుడు గారికి శుభాకాంక్షలు - బుద్దా వెంకన్న!

పార్టీలో చేరి పది రోజులు కూడా కాలేదు అప్పుడే YSRCP నుండి బయటకి వచ్చిన అంబటి రాయుడు.

Meenakshi Gopinathan

రాజకీయాల్లో కొంత మంది సినిమా స్టార్ లు వచ్చినట్టే కొంత మంది క్రికెటర్లు కూడా ఆ రంగంలోకి దిగారు అలా ఆ జాబితాలో ఇప్పుడు అంబటి రాయుడు కూడా వచ్చారు. ఐపీల్ కు వీడుకోలు పలికిన కొద్ది రోజుల్లోనే పాలిటిక్స్ లోకి అడుగు పెట్టారు. అధికార YSRCP పార్టీ తరపున పొలిటికల్ గేమ్ ఆడేందుకు రెడీ అయిపోయారు. ఆంధ్ర ప్రభుత్వం ప్రతిభించిన 'ఆడుదాం ఆంధ్ర' యొక్క బ్రాండ్ అంబాసిడర్ రాయుడు అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. కానీ ఇంతలోనే రాయుడు తన పొలిటికల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసాడు. పార్టీలో చేరి పది రోజులు కూడా కాలేదు అంతలోపే రిటైర్ అయ్యారు. కొద్ది రోజులు పాలిటిక్స్ కి దూరంగా ఉంటానని రాయుడు తన ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేసాడు.

ముఖ్యమంత్రి జగన్ గురించి అర్ధం అవ్వడం వల్లే రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ(TDP) నేత బుద్దా వెంకన్న అన్నారు. YSRCP పార్టీ నుండి రాయుడు బయటకి వచ్చినందుకు రాయుడుకి శుభాకాంక్షలు కూడా తెలిపారు. మీరు స్పోర్ట్స్ ఆటగాళ్లు మీకు స్పోర్టివ్ మనస్తత్వం ఉంటుంది మీకు ఎవ్వరి మీద కక్ష ఉండదు...మీ మీద ఎవ్వరికి కక్ష ఉండదు కానీ ఇలాంటి కక్ష సాధించే వాళ్ళ దగ్గరకి వెళ్లిన కొద్ది రోజులోనే మీరు బయటికి వచ్చేసారు...ఆడుదాం ఆంధ్ర జరుగుతున్న సమయంలోనే భారత దేశంలో గొప్ప క్రికెటర్ అయినా మీరు BYE...BYE జగన్ అని చెప్పినందుకు మీకు శుభాకాంక్షలు అని కూడా బుద్దా వెంకన్న తెలిపారు.

Venkateswara Rao Buddha

రాయుడు ఎందుకు పార్టీ నుండి బయటకి వచ్చాడు అనే దానికి కారణం తనకి మాత్రమే తెలుసు.