ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి 
రాజకీయాలు

'ఫోన్లో నన్ను తిట్టిన ప్రధాని మోదీ..మిథున్ చక్రవర్తి హెల్త్ అప్డేట్!

Telugu Editorial

మిథున్ చక్రవర్తి (73) బెంగాలీ చిత్రం మృగయా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన సీనియర్ నటుడు. తన తొలి సినిమాలోనే నటనకు గాను జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఘనత ఆయనకే దక్కుతుంది. హిందీ, పంజాబీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 350కి పైగా చిత్రాల్లో నటించారు. 2016లో విడుదలైన మలుపు చిత్రంలో (తమిళంలో యాగవరాయినుం నా కాక్క) లో కీలక పాత్ర పోషించారు.

పొలిటికల్ కెరీర్..

తృణమూల్ కాంగ్రెస్ తరఫున మిథున్ పశ్చిమ బెంగాల్లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. శారదా గ్రూప్ ఫైనాన్షియల్ స్కాండల్ తర్వాత పట్టుబడి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2021లో బీజేపీలో చేరిన ఆయన అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల ఫిబ్రవరి 10న గుండెపోటు రావడంతో కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ప్రధాని మోదీ తిట్లు..

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'వాస్తవానికి ఎలాంటి సమస్య లేదు, నేను పూర్తిగా బాగానే ఉన్నాను. నా ఆహారపు అలవాట్లను అదుపులో ఉంచుకోవాలి. చూద్దాం; నేను త్వరలోనే పని ప్రారంభిస్తాను, బహుశా రేపు."

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తనకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని మిథున్ చక్రవర్తి పేర్కొన్నారు. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించనందుకు తనను తిట్టారని చెప్పారు.