Hotel Grand Abids waiters attacked customers. 
వార్తలు

మటన్ ముక్క కోసం గొడవ...కస్టమర్లపై కర్రలతో దాడి చేసిన వెయిటర్లు

హైదేరాబద్ హోటల్ గ్రాండ్ అబిడ్స్ వెయిటర్లు కస్టమర్స్ పై కర్రలతో దాడి చేశారు. ఈ దాడి వల్ల ఆ కస్టమర్స్ తీవ్ర గాయాలకు గురైయ్యారు.

Meenakshi Gopinathan

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పూర్తయ్యాక రాత్రి బిర్యానీ తినడం కోసం ధూల్‌పేట్ కు చెందిన ఓ ఫామిలీ హోటల్ గ్రాండ్ అబిడ్స్ కు వెళ్లారు మరి అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఇకపోతే వెయిటర్ వాళ్ళ కోసం తెచ్చిన బిర్యానీ వేడిగా లేదు అంతే కాకుండా బిర్యానీలోని మటన్ ముక్కలు సరిగ్గా ఉడకలేదాని కస్టమర్స్ ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రమైంది. తొలుత కస్టమర్లు హోటల్ వెయిటర్ల పై దాడి చేయగా అనంతరం వెయిటర్లు కస్టమర్ల పై కర్రలతో దాడి చేశారు. ఇరువైపులా తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్ యజమాని మరియు ముగ్గురు వెయిటర్లును అరెస్ట్ చేసి కేసు దర్యాప్తుచేస్తున్నారు.