సానియా-షోయబ్ 
వార్తలు

'పెళ్లి చాలా కష్టం': విడాకులపై సానియా మీర్జా పోస్ట్

2023లో మాలిక్ తన ఇన్స్టాగ్రామ్ బయోలో 'సానియా మీర్జా అనే సూపర్ ఉమెన్ భర్త అని' మార్చుకున్నాడు. మరోవైపు సానియా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి షోయబ్ మాలిక్తో ఉన్న చాలా ఫోటోలను డిలీట్ చేసింది. ఈ సందర్భంలో...

Telugu Editorial

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ త్వరలోనే విడాకులకు దరఖాస్తు చేసుకోబోతున్నారు.

2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఐదేళ్ల కుమారుడు ఇషాన్ మిశ్రా మాలిక్ ఉన్నాడు. సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే వీళ్ళ పోస్ట్ మరియు స్టోరీ లు చూస్తే ఒకవేళ వీళ్ళు విడిపోతున్నారు ఏమో అన్నట్టు అనిపిస్తుందని నెటిజన్ల మధ్య భారీగా డిస్కషన్స్ జరుగుతున్నాయి.

సానియా మీర్జా

2023లో మాలిక్ తన ఇన్స్టాగ్రామ్ బయోలో 'సానియా మీర్జా అనే సూపర్ ఉమెన్ భర్త అని' మార్చుకున్నాడు. మరోవైపు సానియా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి షోయబ్ మాలిక్తో ఉన్న చాలా ఫోటోలను డిలీట్ చేసింది.

'మీ హృదయ శాంతికి ఏదైనా భంగం కలిగిస్తే దాన్ని వదిలేయండి' అని సానియా మీర్జా జనవరి 8న పోస్ట్ చేసింది.  

ఇప్పుడు ఈ వివాదానికి ఆజ్యం పోస్తూ సానియా మరోసారి తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఓ స్టోరీని షేర్ చేసింది. ఈ స్టోరీలో ఆమె మాట్లాడుతూ...'పెళ్లి కష్టమే. విడాకులు కష్టమే...కఠినమైందాన్ని ఎంచుకోండి.

ఊబకాయం కష్టం. ఫిట్ గా ఉండటం కష్టం...కఠినమైందాన్ని ఎంచుకోండి. రుణగ్రహీతగా ఉండటం కష్టం. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కఠినమైందాన్ని. కఠినమైందాన్ని ఎంచుకోండి. 

సానియా మీర్జా పోస్ట్ స్క్రీన్ షాట్!

ఇతరులతో కమ్యూనికేట్ చేయడం కష్టం.  కమ్యూనికేట్ చేయకుండా ఉండటం కష్టం. కఠినమైందాన్ని ఎంచుకోండి.

జీవితం అంత సులభం కాదు. అది ఎల్లప్పుడూ కష్టంగా ఉంటుంది. కానీ మనం కఠినమైనదాన్ని ఎంచుకోవచ్చు. తెలివిగా ఎంచుకోండి." 

ఈ పోస్ట్ విడాకుల ముందస్తు నోటీసునా అనేది నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది.