Punjab Man dressed up like his Girlfriend to write her exams. 
వార్తలు

అమ్మాయిలా వేషం వేసుకుని గర్ల్ ఫ్రెండ్ పరీక్ష రాయడానికి వెళ్లిన యువకుడు!

బిందీ, లిప్‌స్టిక్ మరియు సల్వార్ కమీజ్ ధరించి తన గర్ల్ ఫ్రెండ్ కి సహాయం చేసే ప్రయత్నంలో కుర్రోడు!

Meenakshi Gopinathan

కొంతమంది 'రిలేషన్ షిప్ కోసం దేశాలు దాటుతారు కొందరు తల్లిదండ్రులను ఏధిస్తారు మరి కొందరైతే తమ రిలేషన్ షిప్ కోసం లక్షలు ఖర్చు పెడతారు కానీ పంజాబ్ లో ఒక కుర్రోడు తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఆమె పరీక్ష ను రాయడానికి వెళ్ళాడు. 

బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్స్ పరీక్షలో పంజాబ్‌లోని ఫజిల్కాకు చెందిన అంగ్రేజ్ సింగ్, తన గర్ల్ ఫ్రెండ్ పరమ్ జిత్ కౌర్ వలె తయారై పరీక్ష రాసేందుకు వెళ్ళాడు. సమాచారం ప్రకారం, పరీక్ష కొట్కాపురలోని DAV పబ్లిక్ స్కూల్‌లో జరగాల్సి ఉంది.

బిందీ, లిప్‌స్టిక్ మరియు సల్వార్ కమీజ్ ధరించి, గర్ల్ ఫ్రెండ్ కి సహాయం చేసే ప్రయత్నంలో సింగ్ ధైర్యంగా కౌర్ వేషాన్ని ధరించాడు. అయితే యూనివర్శిటీ అధికారులు ఒక అడుగు ముందుకేసి అతడిని పట్టుకున్నారు.

ఈ సంఘటన సింగ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టినా, సోషల్ మీడియా సందడి చేస్తోంది. కొందరైతే ఏకంగా, సింగ్ వలె సాహసోపేతమైన భాగస్వామి కావాలని ఆశలు వ్యక్తం చేశారు.