VOC పోర్ట్ ట్రస్ట్ కోసం స్వచ్ఛమైన వెండి సెంగోల్ ను రూపొందించడం ద్వారా GRT జ్యువెలర్స్ హస్తకళా నైపుణ్యం పట్ల నిబద్ధతను మరోసారి చాటి చెప్పింది. ట్యూటికోరిన్ లోని VOC పోర్టు యొక్క ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ శంకుస్థాపన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ఈ అపూర్వమైన సృష్టిని VOC పోర్ట్ ట్రస్ట్ బహుకరించారు. అచ్చేవొధించే పనితనం, సునిశితమైన వివరాలతో తీర్చిదిద్దిన వెండి సెంగోల్ అతిథులందరి దృష్టిని ఆకర్షించి చెరగని ముద్ర వేసింది, దాని కళాత్మతకు నైపుణ్యానికి ప్రశంసలు అందుకుంది.
ఈ కార్యక్రమంలో పోర్ట్ కు ప్రముఖమైన మైలురాయిగా మాత్రమే కాకుండా అరుదైన సందర్భాలకు తన అద్భుతమైన ఆవిష్కరణలతో సహకరించిన GRT జ్యువెలర్స్ ప్రదర్శించిన అంకిత భావానికి మైలురాయి వంటిది. ఆభరణాల రంగంలో చెరగని ముద్ర వేస్తూ, సొగసుకు, సాంప్రదాయానికి విన్నూత ఆవిష్కరణలకు చిహ్నంగా ఈ బ్రాండ్ కొనసాగుతుంది.
అసమాన నాణ్యతకు, అద్భుత పనితనానికి ఈ బ్రాండ్ ఘన చరిత్ర నిదర్శనంగా నిలుస్తుంది. సాంప్రదాయమైన పనితనాన్ని, సమకాలీన డిజైన్లు ప్రతిభావంతంగా మేళవించిన నిత్య నూతన ఆభరణాలకు GRT జ్యువెలర్స్ పర్యాయాపదం గా మారింది.