న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరాన్ని తెరవడం వల్ల పర్యాటక అవకాశాలు పెరుగుతాయని, వివిధ రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని గ్లోబల్ స్టాక్ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ ఒక నివేదికలో తెలిపింది.
అయోధ్యలో రామ మందిరాన్ని జనవరి 22 ప్రారంభించారు.
స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెఫరీస్ రామ మందిరాన్ని తెరవడం వల్ల కలిగే ఆర్థిక అవకాశాలు, రంగాలపై ఒక నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం, రామాలయం ప్రతి సంవత్సరం 5 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
అయోధ్యలో తొలి విమానాశ్రయాన్ని ఇప్పటికే 175 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు. ఇది సంవత్సరానికి సుమారు 10 లక్షల మంది ప్రయాణీకులను నిర్వహించగలదు.
అంతర్జాతీయ విమానాశ్రయం 2025 నాటికి సిద్ధమవుతుందని భావిస్తున్నారు. ఇది సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.
ఇది కాకుండా, అయోధ్య రైల్వే స్టేషన్ కూడా రోజుకు 60,000 ప్రయాణీకులను నిర్వహించే విధంగా అప్గ్రేడ్ చేయబడింది.
రోడ్డు సౌకర్యాలు కూడా మెరుగుపరిచారు. వీటితో పాటు 1,200 ఎకరాల్లో గ్రీన్ టౌన్ షిప్ నిర్మించాలని ఆలోచిస్తున్నారు.
కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్, టౌన్షిప్, రహదారుల నిర్మాణం కొత్త హోటళ్లతో సహా ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని జెఫరీస్ తెలిపింది.
2019లో భారత ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం వాటా 194 బిలియన్ డాలర్లు.
ప్రస్తుతం పర్యాటక రంగం ఆర్థిక వ్యవస్థకు 6.8 శాతం దోహదం చేస్తోంది. 2033 నాటికి ఇది 8 శాతం CAGR నుంచి 443 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని జెఫరీస్ అంచనా వేసింది.
అయోధ్యను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల హోటళ్లు, ఎయిర్లైన్స్, ఎఫ్ఎంసీజీ, ట్రావెల్ అనుబంధ రంగాలు, సిమెంట్ వంటి రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది.