'విదుతలై' చిత్రబృందం  
సినిమా

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ లో షో చేస్తూ సెంటర్ స్టేజ్ ఎక్కిన విడుదల!

Telugu Editorial
విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'విడుదల'. ఈ చిత్రం మొదట తమిళంలో విడుతలైగా రూపొందింది ఆపై తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల అనే టైటిల్ తో రిలీజ్ చేయడం జరిగింది.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే రెండో భాగాన్ని కూడా చిత్రీకరించి విడుదలకు సిద్ధంగా ఉంచారు.

పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

జనవరి 25 నుంచి ఫిబ్రవరి 4 వరకు నెదర్లాండ్స్ లో జరుగుతున్న 53వ అంతర్జాతీయ రోటర్ డ్యామ్ ఫిల్మ్ ఫెస్టివల్ కు కోలీవుడ్ నుంచి వెట్రి మారన్ 'విడుతలై', రామ్ దర్శకత్వంలో నివిన్ పౌలీ నటించిన 'ఎజ్హు కాదల్ ఎజ్హు మలై' చిత్రాలు వెళ్లాయి.

వెట్రిమారన్, రామ్, విజయ్ సేతుపతి, సూరి, నివిన్ పౌలీ, అంజలి నెదర్లాండ్స్ వెళ్లారు.

సూరికి ఇదొక స్పెషల్ మూమెంట్. ఈ రెండు చిత్రాల్లోనూ సూరి నటించారు.

ఈ వేడుకలో 'విడుదల' రెండు భాగాలను ప్రదర్శించారు. ఐదు నిమిషాల పాటు ప్రజలు లేచి నిలబడి చప్పట్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఈ వీడియోను రెడ్ జెయింట్ మూవీస్ తమ ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది.