ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు బ్లాక్‌బస్టర్ కానప్పటికీ, ఏ రివ్యూ చూసినా సినిమాలో ఉన్న చిన్న వివరాలను ఎవరైనా కనుగొంటారేమో అని దర్శకుడు ఆశపడ్డారట...సినిమాకి Oy అని ఎందుకు పేరు పెట్టామంటే...
ఇది మణిరత్నంగారి సినిమాల్లో అమ్మాయి ఓయ్ అని పిలవడం నుండి ప్రేరణ పొందిన కూడా ఇంకొక బలమైన కారణం ఉంది...నేను ముందు ఈ టైటిల్ ను పరుగు సినిమాకు సజెస్ట్ చేసాను...ఆ తర్వాత నేను నా సొంత స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నా కథలో సంధ్య ఉదయ్ ను ఓయ్ అని పిలవాలనుకున్నాను. ఓయ్ అని పిలవడం తెలుగు ప్రజల ఇళ్లల్లో చాలా సాధారణమైన విషయం.
ఓయ్! ఈ సినిమాకు Oy అని పేరు పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే...
సంధ్యతో ఉదయ్ ప్రేమ కథ అతని పుట్టినరోజు అయినా జనవరి 1st 2007 నాడు ప్రారంభమవుతుంది. ఆపై అతని తండ్రి మరణిస్తాడు.
సంక్రాంతి సందర్భంగా ఆకాశంలో గాలిపటాలు.
ఇంకో సీన్ లో వాలెంటైన్స్ డే అంటే అందరికి మీరే గుర్తుకు వస్తారని సంధ్య గుబీలతో మాట్లాడుతుంది
ఆపై హోలీ సీక్వెన్స్ ఉంది
సంధ్య స్నేహితురాలి పిల్లలు వేసవి సెలవులకు వస్తారు.
ఓడలో వినాయక చవితి సీలెబ్రేషన్స్ ఉంటాయి.
సంధ్య తన ఇంట్లో మొట్ట మొదటి సారి క్రిస్మస్ పార్టీ ఇస్తుంది.
ఇక డిసెంబర్ 31న రాత్రి చినుకులు కురిసే ప్రదేశానికి సంధ్యను ఉదయ్ తీసుకుని వెళ్తాడు.
ఆపై సంధ్య జనవరి 1, 2008న చనిపోగా, ఆ సంవత్సరం తర్వాత ఉదయ్ తన పుట్టినరోజును జరుపుకోవడాన్ని ఆపేస్తాడు.
అలా ఉదయ్ మొదటి ప్రేమ సరిగ్గా ఒక సంవత్సరం పాటు సంధ్యతో గడిచింది అందుకే ఆ టైటిల్ Oy వన్ ఇయర్(one year).