Devara Glimpse released 
సినిమా

దేవర గ్లింప్స్ వీడియోలో...ఆ చివరి డైలాగ్ మాత్రం..?

Meenakshi Gopinathan

అటు MB ఫాన్స్ ఇటు నాగ్, వెంకీలా ఫాన్స్ సంక్రాంతి ఎప్పుడొస్తుందా అంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇంకో పక్క తేజ సజ్జ ఒక పాన్ ఇండియన్ ఫిలింతో మన ముందుకు రాబోతున్నాడు. ఇలా వీళ్లందరి ఫాన్స్ సంక్రాంతిని భారీగా సెలెబ్రేట్ చేస్తున్నప్పుడు మరీ ఎన్టీఆర్ ఫాన్స్ ఎందుకు ఏప్రిల్ దాకా వెయిట్ చెయ్యాలని దేవర టీమ్ ఆలోచిస్తూ ఫాన్స్ దిల్ కుషి అయ్యేలా దేవర గింప్స్ ని విడుదల చేశారు.

Devara Part -1 NTR 30

ఆ గింప్స్ లో జూనియర్ ఎన్టీఆర్ మునుపెన్నడూ కనపడనంత భయంకరంగా ఊర మాస్ లుక్ లో ఉన్నారు. వీడియో చివరిలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ విని ఫాన్స్ కి పూనకాలు వచ్చినంత పనైంది. ఇక అదిరిపోయే విజువల్స్ కి అనిరుద్ ఇచ్చిన ఇంగ్లీష్ వోకల్స్ అయితే బూస్టర్ లా ఉన్నింది. ఒక నిమిషం పాటు వచ్చిన గ్లింప్సె ఇంత అరాచకం సృష్టించిందంటే ఇక థియేటర్లో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత సందడిగా ఉంటుందో అని కామెంట్స్ లో తెలపండి.