Actor Prabhas 
సినిమా

ఈ ఏడాది ప్రభాస్ ఫాన్స్ కి పండగే పండగ - వాడు ఎక్కడున్నా రాజే!

Meenakshi Gopinathan

బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా అపారమైన అభిమానులను సంపాదించుకున్న రెబల్ స్టార్ పాన్ ఇండియాన్ స్టార్ గా మారిపోయారు...బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా చూడాలంటే రెండు ఏళ్ళు వెయిట్ చెయ్యాల్సిందే అన్నట్లు అయిపోయింది. 2019లో రిలీజ్ అయినా సాహో, 2022లో రిలీజ్ అయినా రాధేశ్యామ్ ఇక 2023లో రిలీజ్ అయినా ఆదిపురుష్ సినిమాలు పెద్దగా మంచి రెస్పాన్స్ ను పొందలేక పోయింది. ఇక ప్రభాస్ కెరీర్ అయిపోయింది అన్నట్లు పలువురు నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు అయితే వీటంటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయినా సలార్ర్ సీజ్ ఫైర్ - పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను బద్దలు కొట్టింది. సలార్ శౌర్యంగా పర్వం - పార్ట్ 2 చూడాలనే ఆసక్తిని మరింత పెంచింది.

Salaar Ceasefire - Part 1

ఇకపోతే ప్రభాస్ సినిమా చూడాలంటే రెండేళ్లు వెయిట్ చెయ్యాలనే బాధ కూడా 2023తో పోయింది ఎందుకంటే గత యాడాది ప్రభాస్ రెండు సినిమాలు రిలీజ్ చేసారు...ఆపై ఈ ఏడాది అయితే ప్రభాస్ ఫాన్స్ కి పండగే పండగ...డిసెంబర్ లో రిలీజ్ అయ్యి హల్ చల్ సృష్టిస్తున్న సలార్ ఫీవర్ నుండి బయటకి రాకముందే ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ అప్‌డేట్లు వచ్చేస్తున్నాయి.

కల్కి 2898 AD ఈ సినిమా గురించి అందరికి తెలిసిందే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోణె వంటి స్టార్స్...కల్కి సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా 2024లోనే రిలీజ్ అని భారీగా టాక్స్ వినపడుతున్నాయి.

Kalki 2898 AD

ఆ తర్వాత రెబల్ స్టార్ మారుతీ దర్శకత్వంలో ఒక హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రం పేరు రాజా డీలక్స్ అని చెప్పుకుంటున్నారు మరి అధికారిక టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చిత్ర బృందం తెలిపింది.

Prabhas new movie announcement poster

ఇది ఇలా ఉండగా గత ఏడాది యానిమల్ సినిమాతో హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా దర్సకత్వంలో స్పిరిట్ అనే సినిమాని ప్రారంభించనున్నారు. 'స్పిరిట్' ప్రభాస్ 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక ప్రభాస్ ఆ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేయనున్నారని తెలిసిన తర్వాత సినిమాకి మరింత హైప్ పెరిగింది. 2023 లోనే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించేసాము ఇక సినిమా షూటింగ్ అయితే 2024 సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.

Spirit movie

ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప అనే టైటిల్ తో కూడిన సినిమాలో అతిధి పాత్ర చేయబోతున్నారు ప్రభాస్. ప్రభాస్ కి ఇలాంటి పీరియాడిక్ ఫిలిం మంచి విజయాన్ని అందిస్తుదన్న మాట తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివన్న మరియు మలయాళం స్టార్ మోహన్ లాల్ కూడా అతిధి పాత్ర పోషిస్తున్నట్లు భారీగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాని ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

Kannappa movie

హను రాఘవపూడి దర్సకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. నివేదికల ప్రకారం హను రాఘవపూడితో ప్రభాస్ చేయబోయే చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని ఆ సినిమాలో శ్రీ లీల నటించబోతుందని టాక్స్ వినిపిస్తుంది.

మరి ఇప్పుడు వీటంటికి అధికారిక అప్‌డేట్ వచ్చే వరకు వెయిట్ చెయ్యాలి.

Actor Prabhas, Actress Sree Leela, Director Hanu Raghavapudi.

ప్రభాస్ కెరీర్ ఇక అయిపోయిందని చెప్పుకున్న వాళ్ళందరూ నోరు మెదపలేనట్లు రెబల్ స్టార్ అప్ కమింగ్ మూవీ లైన్ ఉంది. ఈ అప్‌డేట్లు తెలుసుకున్న రెబల్ ఫాన్స్ బాహుబలి సినిమాలో 'వాడు ఎక్కడున్నా రాజే' అనే డైలాగ్ ని నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేసే వారికి చెప్తున్నారు.

Baahubali movie