The Raja Saab 
సినిమా

అప్‌డేట్ల కోసం నెలలు తరబడి వెయిట్ చేసే రోజులు పోయాయి!

Meenakshi Gopinathan

‘సలార్‌’ ఘనవిజయం తర్వాత మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే మరి ఈ సినిమా టైటిల్ ‘ది రాజా సాబ్‌’ అని మేకర్స్ ప్రకటించారు. రెబల్ స్టార్ 'ది రాజా సాబ్' నుండి తన ఫస్ట్ లుక్‌ను కూడా సోషల్ మీడియా లో పంచుకున్నారు.

గత ఏడాది పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్' చిత్రం విడుదలైంది. ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించి రెబల్ ఫాన్స్ ని సంతోషంలో ముంచెత్తినది. 'సలార్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. 'ఆదిపురుష' బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ను పొందలేక పోయింది, ఇప్పుడు 'సలార్' సినిమాతో ప్రభాస్ పునరాగమనం చేశారు. ఇదిలా ఉంటే, ప్రభాస్ చేయబోయే సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.

Salar Part -1 Ceasefire

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో దర్శకుడు మారుతీ రూపొందించిన 'ది రాజా సాబ్' ఒక రొమాంటిక్ హారర్ మరియు పాన్-ఇండియా చిత్రంగా రూపొందుతుంది. తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.

Director Maruthi

ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే, అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు మరియు కామెంట్ సెక్షన్‌ను ముంచెత్తారు. ఫాన్స్ అందరూ కామెంట్స్ లో వింటేజ్ ప్రభాస్ ని చూస్తున్నట్లుందని చెప్తున్నారు. ఇక మరి కొందరు డార్లింగ్ సినిమా డేస్ కళ్ల ముందు మెదులుతుంది వెల్లడించారు.

'ది రాజా సాబ్'ఫస్ట్ లుక్లో ప్రభాస్ లుంగీ లో కనిపించారు. ప్రభాస్ యొక్క ఈ లుక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది మరియు అతని ప్రత్యేక శైలిని ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రభాస్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో కల్కి 2898 AD ఈ ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలో దీపికా పడుకోణె, అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కూడా కనిపించనున్నారు.

Kalki 2898 AD