Jagadheka Veerudu athiloka Sundari, Mahanati, Maharshi, Kalki 2898 AD. 
సినిమా

ఇంకా కల్కి 2898 AD మూవీ హిట్...మే 9 వైజయంతీ మూవీస్ కి లక్కీ డేట్!

నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న మహానటి, మహర్షి కూడా ఇదే తేదీలో లోనే రిలీజ్ అయ్యింది ఇప్పుడు కల్కి 2898 AD సినిమా కూడా అదే రోజున ఈ ఏడాది గ్రాండ్ రిలీజ్ అని వైజయంతి మూవీస్ అనౌన్స్ చేశారు.

Meenakshi Gopinathan

ప్రభాస్ హీరోగా తెరక్కేకుతున్న కల్కి సినిమా లో దీపికా పడుకోణె, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కమల్ హాసన్ విల్లన్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి మూవీ పై భారీ అంచనాలున్నాయి. మే 9, 2024న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సమందించి పోస్టర్లు మరియు గ్లింప్సె రిలీజ్ చేశారు వాటిని చూస్తే ఇదొక సైంటిఫిక్ ఫిలిమ్ అయ్యుండచ్చని పలువురు చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా 2020 నవంబర్ లో ప్రాజెక్ట్ K గా సెట్స్ పైకి వచ్చింది. గత యడాది జులై లో శాన్ డియెగో కామిక్ కాన్ ఈవెంట్ లోఈ చిత్రం యొక్క అధికారిక టైటిల్ అయినా కల్కి 2898 AD టైటిల్ ని నిర్మాతలు ప్రకటించారు.

Project -K

ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ చాలా మంది ప్రభాస్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టినట్టు అయ్యింది...ఎందుకంటే వైజయంతి మూవీస్ ప్రొడక్షన్స్ లో మే 9న విధాలైన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

1990లో మెగాస్టార్ చిరంజీవి, అందాల రాశి శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న రిలీజ్ అయ్యింది.

Jagadheka Veerudu athiloka sundari.

మూడు నేషనల్ ఫిలిం అవార్డ్స్ గెలిచినా మహానటి కూడా 2018 మే 9న రిలీజ్ అయ్యింది.

Mahanati

2019లో రెండు నేషనల్ ఫిలిం అవార్డ్స్ గెలిచి హిట్ మూవీ గా నిలిచినా మహర్షి కూడా మే 9న రిలీజ్ అయ్యింది.

Maharshi

ఇకపోతే వైజయంతి మూవీస్ వ్యవస్థాపకుడు మరియు నిర్మాతైనా సి. అశ్విని దత్ స్వయంగా ఈ డేట్ స్పెషలిటీ గురించి చెప్పారు "మా సినీ ప్రయాణంలో మే 9కి ఉన్న ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుంది. జగదేకవీరుడు అతిలోక సుందరి నుండి అవార్డు గెలుచుకున్న మహానటి మరియు మహర్షి వరకు ఈ తేదీ మా సినీ చరిత్రలో ఒక స్థానం సంపాదించుకుందని" అని తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫాన్స్ సంతోషాన్ని పట్టలేకున్నారు. కొందరైతే మహానటి, మహర్షి సినిమాలాగే కల్కి కూడా నేషనల్ అవార్డు గెలుస్తుందని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.