Mahesh Babu emotional speech 
సినిమా

ఇకనుంచి మీరే నాకు అమ్మ...మీరే నాకు నాన్న...మీరే నాకు అన్నీ..! - బాబు ఎమోషనల్ స్పీచ్.

గుంటూరు కారం ప్రీ - రిలీజ్ ఈవెంట్ లో మహేష్ తన నాన్న గురించి తలుచుకుని చాలా ఎమోషనల్ అయ్యారు.

Meenakshi Gopinathan

నిన్న గుంటూరులో గ్రాండ్ గా జరిగిన గుంటూరు కారం సినిమా ప్రీ - రిలీజ్ ఈవెంట్ లో బాబు మాటలకి ఫాన్స్ అందరు కంట దాడి పెట్టుకున్నారు. సినిమా రంగంలో నేను 25 ఇయర్స్ పూర్తి చేశానని వీడియోలో చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇక ఈ పాతిక సంవత్సరాలు మీరు చూపించిన అభిమానాన్ని నేను మర్చిపోలేను...అది ప్రతి యాడాది పెరుగుతూనే ఉంది. Thank you so much..!

మాటలు లేవు అసలు ఎం చెప్పాలో నాకు తెలియడంలేదు...ఎప్పుడు చెప్తూ ఉంటానుగా చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏమి తెలియదని చెప్పి తన ఫాన్స్ కి చేతులెత్తి దండం పెట్టాడు బాబు. మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారని ఫాన్స్ దిల్ ఖుషి చేశారు.

నాకు నాన్న గారికి సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్బస్టర్. ఈ సారి కూడా బాగా గట్టిగ కొడతాం...కానీ ఈ సారి కొంచం కొత్తగా ఉంది ఎందుకంటే నాన్నగారు మన మధ్యలేరు అందువల్లేమో...ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ల గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని...దానికోసమే ఇవ్వన్నీ...ఇప్పుడు అవ్వన్నీ మీరే చెప్పాలి నాకు...ఇక నుంచి మీరే నాకు అమ్మ...మీరే నాకు నాన్న...మీరే నాకు అన్ని...మీ ఆశీస్సులు, అభిమానాలు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Mahesh babu and his father krishna.
Mahesh Babu parents Krishna and Indira Devi