సౌత్ ఇండియన్ సినిమాలో ధనుష్, విజయ్ కమల్ హస్సన్, కార్తీక్, విశాల్ వంటి పలు స్టార్ హీరోలతో నటించింది. ఆండ్రియా ఒక నటిగా మాత్రమే కాకుండా ప్లేబ్యాక్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సక్సెస్ అయ్యింది. ఈ లెజెండరీ హీరోయిన్ కు నేడు 38వ పుట్టినరోజు.
తమిళ చిత్రసీమలో విభిన్నమైన చిత్రాలకు పేరుగాంచిన గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిష్కిన్, వెట్రిమారన్, రామ్, సెల్వరాఘవన్ వంటి దర్శకుల సినిమాలో ఆండ్రియా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసింది.
సినిమాలో సపోర్టింగ్ రోల్‌లో కనిపించిన ఆండ్రియా ద్రోహి సినిమా ద్వారా హీరోయిన్ గా అవతరించింది. సంగీతంతో అందర్నీ మెప్పించాలనే తపనతో మెల్లగా నటిగా ఎదిగింది.
తమిళ సినిమా ‘వడచెన్నై’లో ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాలో తన నటన చూసి ప్రశంసల వర్షం కురిపించారు అయితే ఈ సినిమాలో నటించడం తన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసిందన్నారు. ఉన్న సినిమాలన్నింటిలో నటించకుండా కేవలం తన పాత్రకు ప్రాముఖ్యతనిచ్చే క్యారెక్టర్ లోనే నటిస్తాను అని ఆండ్రియా ఒక స్టేజి లో చెప్పింది. మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరైన ఆండ్రియా, ఫహద్ ఫాజిల్ సరసన 'అన్నయుమ్ రసూలుమ్' చిత్రంలో నటించి మంచి ఆదరణ పొందింది.
పుష్ప సినిమాలోని మెగా హిట్ సాంగ్ అయినా ఓ అంటావా మావ సాంగ్ యొక్క తమిళ్ వెర్షన్ ని ఆండ్రియా పాడి ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆ పాట నేటి వరకు తమిళ ప్రజల అలరిస్తోంది. ఈ పాటను చాలా బాగా పాడినందుకు ఆండ్రియాను అభినందించారు.
ప్రముఖ స్వరకర్తలందరి సంగీతంలో పాడి ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చిన ఆండ్రియా తన ఫేవరెట్ కంపోజర్ డీఎస్పీ అని స్వయంగా చాలా చోట్ల ఓపెన్‌గా చెప్పుకొచ్చింది.
సౌత్ ఇండియన్ నటీనటులలో ఒకరిగా పేరున్న ఆండ్రియా.. తాను మహిళా ప్రధాన చిత్రాల్లో నటించడానికే ఇష్టపడతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాంటి అవకాశం 'యుగానికి ఒక్కడు' సినిమాలో రావడంతో ఆ పాత్ర చేసేసాను అని తెలిపింది.
రాబోయే సినిమాలు:
శైలేష్ కొలను దర్శకత్వం వహించి విక్టరీ వెంకటేష్ సరసన సైంధవ్ అనే చిత్రంలో ఆండ్రియా ప్రధాన పాత్ర పోషించింది. అలగు కార్తీక్ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం 'నో ఎంట్రీ'లోనూ ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ట్రైలర్ యాడాది క్రితమే రిలీజ్ అయింది త్వరలో ఈ చిత్రం విడుదల కానున్నది.
ఆండ్రియా చాలా బోల్డ్ పర్సనాలిటీ మరియు చాలా స్నేహపూర్వకంగా కలిసి ఉంటుంది. ఈ వెర్సటైల్ హీరోయిన్ కు పుట్టినరోజు శుభాకాంషలు!