Bramhanandam 
సినిమా

ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ఆ రోజు వచ్చేసింది...బ్రహ్మీ కమ్ బ్యాక్!

Meenakshi Gopinathan

బ్రహ్మీ స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ అందరూ సందడి చేసుకోవడం ప్రారంభిస్తారు హీరో ఎవరైనా కానీ సినిమాలో బ్రహ్మానందం ఉన్నారు అంటే ఇక మరో సెకండ్ ఆలోచించకుండా టిక్కెట్లు బుక్ చేసేస్తారు...ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ క్రేజ్ ఉన్న బ్రహ్మీని ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు చాలా మిస్ అవుతున్నారు. బాద్‍షా, వెంకీ రి - రిలీజ్ అయిన థియేటర్ లో అంత సందడి జరగడానికి ముఖ్య కారణం టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం. ఈ రెండు సినిమాల్లో బ్రహ్మీ గారి ఒక్కో డైలాగ్ దానికి ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒక్కో డైమండ్ లాంటిది. ఎంత రి - రిలీజ్ సినిమాలు చూసిన బ్రహ్మి గారు కొత్త సినిమాల్లో కనిపించడం లేదన్న ఆందోళన ప్రతి ఫ్యాన్ లోను ఉంది...ఇప్పుడు ఆ ఆదోళనకు గుడ్ బాయ్ చెప్పే విధంగా బాలీవుడ్ సినిమా లో బ్రహ్మీ కనిపించనున్నారు.

Baadhsah and Venky movies.

దాదాపు 25 ఏళ్ల తర్వాత కామెడీ కింగ్ బాలీవుడ్ తెరపైకి రావడం మరింత ఉత్తేజకరమైన విషయం. బ్రహ్మానందం గారి మొదటి హిందీ చిత్రం అమితాబ్ బచ్చన్ యొక్క సూర్యవంశం. మేజర్ మరియు స్కందలో తన పాత్రలకు గుర్తింపు పొందిన తొలి హీరో గురు రంధవా మరియు నటి సాయి మంజ్రేకర్‌లతో కలిసి కుచ్ ఖట్టా హో జాయ్‌ లో బ్రహ్మీ కనిపించబోతున్నారు.

జి అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మి పాత్రకు సంబంధించిన వివరాలు మిస్టరీగా ఉన్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 16, 2024న థియేట్రికల్ విడుదలకు షెడ్యూల్ చేయబడింది ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ అభిమానులను మరోసారి అలరించడానికి బ్రహ్మీ తిరిగి వస్తారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bramhanandam in Kuch Khatta Ho Jaay

ఇంతే కాకుండా ప్రభాస్ చిత్రం ది రాజా సాబ్ మరియు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో కూడా కనిపిస్తారని ఊహాగానాలు వ్యాపించాయి.