బిగ్‌బాస్ ఉల్టా పుల్టా సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. పబ్లిక్ న్యూసెన్స్ కేసులో ప్రశాంత్ అరెస్ట్ అయిన దగ్గరి నుంచి తన ఫ్రెండ్స్ భోలే షావలి, ప్రిన్స్ యావర్, శివాజీ అన్ని విధాలుగా రైతుబిడ్డ ఫ్యామిలీకి అండగా నిలిచారు. బెయిల్ రావడానికి కూడా భోలే చాలా ప్రయత్నాలు చేసాడు. ఇక ప్రశాంత్ బయటికి వచ్చిన తర్వాత సీజన్-7 కంటెస్టెంట్స్ కొంతమంది గెట్ టుగెథర్ అయ్యారు. శివాజీ, యావర్, తేజ, భోలే, శుభశ్రీ, నయని పావని.. ప్రశాంత్‌ను కలిసి మాట్లాడి సంబరాలు చేసుకున్నారు.
బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టుపై బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్ అయినా శివాజీ, యావర్, శుభశ్రీ చాలా బాధ పడ్డారు ఇక తాను తొందరగా బయటకి రావాలి అని కూడా ఆశ పడ్డారు అయితే ఇప్పుడు వాళ్ళ ఆశ నెరవేరింది. పల్లవి ప్రశాంత్ బెయిల్‌పై విడుదలయ్యాడు. పల్లవి ప్రశాంత్ బెయిల్‌పై విడుదలవడంతో శివాజీ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రశాంత్‌ను కలిసేందుకు యావర్, భోలే, తేజ, శుభశ్రీ, నయనీ పావని వీళ్ళందరూ వచ్చారు.