సినిమా

సంక్రాంతి రేస్ నుండి బయటకి వెళ్లిన అయలాన్ మరియు కెప్టెన్ మిల్లర్!

Meenakshi Gopinathan

ఆర్. రవికుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమా అయలాన్...షూటింగ్ అయితే 2018లోనే మొదలు పెట్టేసారు...VFX కారణంగా సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంత ఆలస్యం అయ్యింది. అయలాన్ టీమ్ యొక్క ఇన్నేళ్ల కష్టం వృధా కాలేదని ట్రైలర్ ను చూసిన వాళ్లకి బాగా అర్ధమైయుంటుంది. ట్రైలర్ లో ఎలియాన్ ఉన్న పోర్షన్స్ అన్ని చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి...ఇకపోతే బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ్ ఎలియాన్ కు వాయిస్ అందించడం సినిమాకు బూస్టర్ లా మారీ చాలా మంది ఫాన్స్ ని ఆకట్టుకునింది. సిద్ధార్థ్ కు టాలీవుడ్ లో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇక రెమో సినిమాతో శివకార్తికేయన్ కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఎంత దగ్గరైన సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో అయలాన్ రిలీజ్ కావడం లేదు.

గుంటూరు కారం, నా సామిరంగా, సైన్ధవః ఇక హనుమాన్ అని...ఇంత పొడుగు లిస్ట్ లో డబ్బింగ్ సినిమాకి ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తారా అన్న ప్రశ్న లేసినట్టుంది అందుకే అయలాన్ రిలీజ్ ను సంక్రాంతికి వారం తర్వాతో లేదా జనవరి చివరిలోనో రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.

ఇకపోతే కెప్టెన్ మిల్లర్ కి కూడా ఇదే పరిస్థితి ధనుష్ సరసన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్...ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకి పూనకాలు వచ్చేటట్టు చేసింది. రఘువరన్ B.TECH సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన ధనుష్ ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ గా తెలుగు ప్రేక్షకులకి కనపడనున్నాడు...అయితే సంక్రాంతి రేస్ లో నుండి తెలుగు సినిమాలే తప్పుకుంటున్నాయి ఇప్పుడు డబ్బింగ్ సినిమాకి పెద్దగా ప్రాధాన్యత ఉండదని ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా సంక్రాంతికి వారం తర్వాత లేదా జనవరి చివరికి వాయిదా వేశారు.