రణబీర్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'యానిమల్'.
ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ మరియు తృప్తి దిమ్రీ కూడా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, ఇది పితృస్వామ్య దృష్టితో కూడిన చిత్రంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రష్మికకు సినిమాపై ప్రశ్నలు సంధించారు.
సినిమాలోని 'కర్వా చౌత్' సీన్‌పై చాలా విమర్శలు వచ్చాయి. దీని గురించి రష్మిక ఏమనుకుంటున్నారని ప్రశ్నించారు.
దానికి రష్మిక బదులిస్తూ.. "కర్వా చౌత్ అనే సీన్‌ని తొమ్మిది నిమిషాల షాట్‌లో చిత్రీకరించాం. నేను ఆ సీన్‌ని పూర్తి చేయగానే సెట్‌లో ఉన్నవారంతా క్లాప్ కొట్టారు. కానీ ట్రైలర్ రాగానే ఆ సీన్ చేసినందుకు నన్ను ట్రోల్ చేశారు.
నేను నటించిన 9 నిమిషాల సన్నివేశం సెట్‌లో ఉన్నవారికి నచ్చింది. కానీ జనాలకు నచ్చలేదు. కాబట్టి ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో మనం నిజంగా తెలుసుకోవాలని నేను భావిస్తున్నాను.
ఈ సినిమా స్త్రీ, పురుషాధిపత్యానికి విరుద్ధమంటూ వస్తున్న విమర్శలపై రష్మికను అడిగితే.. "ఇది కేవలం పాత్రకు సంబంధించిన సినిమా. తన తండ్రి కోసం ఆ పాత్ర ఏ స్థాయికైనా వెళ్తాడు. ఇది కేవలం కథ మాత్రమే. , అంతే.. రంగులు లేకుండా రియల్ గా కచ్చితమైన సినిమా రావాలంటే ఇలాగే ఉండాలి.