Actor Mahesh babu's daughter Sitara arranged special screening for orphan kids. 
సినిమా

తండ్రికి నేను ఏమి తక్కువ కాదన్నట్టు రంగం లోకి దిగిన సితార.

Meenakshi Gopinathan

తండ్రి ఏమో ఒక పక్క మహేష్ బాబు ఫౌండేషన్ ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్ధాపురం అనే రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా గ్రామస్థుల సంక్షేమం కోసం పాఠశాలలు, అంగన్వాడీ భవనాలు, గ్రంథాలయాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు కంప్యూటర్‌ ల్యాబ్ నిర్మాణంలో దిగారు. గ్రామస్తుల విద్య, వైద్య మరియు సంక్షేమానికి సంబంధించిన అనేక సౌకర్యాలను ఈ ఫౌండేషన్ అందిస్తుంది.

ఇకపోతే ఆంధ్రా హాస్పిటల్స్ మరియు రెయిన్‌బో హాస్పిటల్స్‌కి చెందిన నిపుణుల బృందంతో కలిసి, ప్రాణాపాయకరమైన పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల చికిత్స కోసం మహేష్ బాబు ఫౌండేషన్ పిల్లలకు తన సహాయాన్ని అందిస్తున్నారు.

ఇప్పుడు నా తండ్రికి నేను ఏమి తక్కువ కాదన్నట్టు సితార రంగం లోకి దిగారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి ఘనంగా విడుదలైంది. ఈ సినిమాకి మిక్స్డ్ తల్క్స్ ఉన్న ఫామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ థియేటర్ లో రాగానే ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూతురు సితార అనాధ పిల్లల కోసం తన తండ్రికి చెందిని AMB థియేటర్ లో గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్ వేయించారు. గత ఏడాది AMB థియేటర్ లో సమంత అనాధ పిల్లల కోసం HI నాన్న సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేయించారు. ఇప్పుడు సితార గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్ వేయించారు.