Actor Mahesh babu with his family 
సినిమా

మహేష్ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌..!

Meenakshi Gopinathan

నూతన సంవత్సారానికి అందరూ చాలా ఆకాసక్తికరంగా ఎదురు చూసి గ్రాండ్‌గా స్వాగతం పలికారు. కొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను జరుపుకొన్నారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమానులకు, ఫాలోవర్లకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు దుబాయ్‌లో నూతన సంవత్సరం వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసున్న ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఆ ఫొటోలో నమ్రత మరియు మహేష్ చాలా హ్యాపీగా ఉన్నారు. సహజత్వం, నవ్వు , ప్రేమ ఇక సాహసం మరియు ఎదుగుదల ’ అని క్యాప్షన్‌ ఇస్తూ అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భార్యపై తన ప్రేమకు ప్రతీకగా లవ్‌ ఎమోజీని కూడా షేర్‌ చేశారు. ఈ పోస్టుకు నమత్ర కూడా వెంటనే రిప్లై ఇచ్చింది. ‘లవ్ యు ది మూన్ అండ్ బ్యాక్ అండ్ ఫరెవర్’ అంటూ లవ్‌ ఎమోజీలు షేర్‌ చేసింది. ప్రస్తుతం మహేష్ బాబు షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. మహేష్ నమ్రతల జోడీ ఎంతో క్యూట్‌గా ఉందంటున్నారు అభిమానులు, నెటిజన్లు. అలాగే ప్రతిగా న్యూ ఇయర్‌ విషెస్‌ చెబుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతికి గుంటూరు కారంతో సినిమాతో మన ముందుకు రానున్నాడు మహేష్. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మీనాక్షి చౌదరి సెకెండ్‌ లీడ్‌లో మెరవనుంది. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్‌రాజ్‌, సునీల్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్. తమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో 'కుర్చీ మడతపెట్టి’ అనే పాట యొక్క లిరికల్ వీడియోను విడుదల చేశారు ఆ పాటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్. బాబు డాన్స్ కి ఫాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా యూ ట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న గుంటూరు కారం సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.