Hrithik Roshan and Vijay Deverakonda about 12th Fail. 
సినిమా

హ్రితిక్ రోషన్ నుండి విజయ్ దేవరకొండ వరకు 12th Fail చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు!

శ్రద్ధా లాంటి అమ్మాయికి...బయట ఉన్న ప్రతి మనోజ్‌కి...నా ప్రేమ, ప్రార్థనలను అందిస్తున్నాను. ఫిల్మ్ మేకింగ్‌ అయితే ''మాస్టర్‌క్లాస్''.

Meenakshi Gopinathan

ప్రస్తుతం ఈ రెండు ట్వీట్ లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 12th ఫెయిల్‌ సినిమా క‌థ ఏమిటంటే...చంబల్‌లోని ఒక చిన్న గ్రామం నుండి ఢిల్లీలోని UPSC ప్రిపరేషన్ కోసం వ‌చ్చిన మనోజ్‌ ఢిల్లీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకొని తన కలను ఎలా సాకారం చేసుకున్నాడన్నదే ఈ మూవీ సారాంశం. ప్రస్తుతం OTT ప్లాట్ఫారం అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

12th FAIL

పెద్ద పెద్ద ప్రమోషన్స్ లేకుండా గత ఏడాది అక్టోబర్‌ లో థియేటర్లలో విడుదలైన చిత్రమే 12th ఫెయిల్‌. ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా OTT లో రిలీజ్ అయినా తర్వాత మంచి రెస్పాన్స్ ను అందుకునింది చాలా మంది ఈ సినిమాను థియేటర్ లో చూడనందుకు బాధ పడ్డారు. ఇప్పటికి కూడా ఈ సినిమా లోని చాలా సీన్స్ సోషల్ మీడియా లో వైరల్ గానే ఉన్నాయి.

Director Vidhu Vinod Chopra.

12th Fail ప్రముఖ IPS ఆఫీసర్‌ మనోజ్‌ కుమార్‌ నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని విధు వినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు. విక్రాంత్‌ మస్సే మనోజ్‌ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో చాలా సీన్స్ రియలిస్టిక్ గా ఉంటాయి. సినిమాలో విక్రాంత్ బాధ పడేటప్పుడు ఆ సీన్ ని చూసే వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరిగుతుంది. పేద విద్యార్థుల జీవితాలను 12th Fail సినిమాలో ఎంతో చక్కగా దర్శకుడు రూపొందించారు. ఈ సినిమా కామన్ ఆడియన్స్ మధ్య మాత్రమే కాకుండా పలువురు సెలెబ్రిటీలను కూడా ఆకర్షించింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవేరుకోండ ఈ సినిమా పై ప్రశంలా వర్షాన్ని కురిపించారు.

IPS officier Mr.Manoj Kumar Sharma.

హ్రితిక్ రోషన్ తన ఎక్స్ ఖాతాలో

ఎట్టకేలకు 12th Fail చూసాను ఫిల్మ్ మేకింగ్‌ అయితే ''మాస్టర్‌క్లాస్''. అన్నిటికీ మించి ముఖ్యమైన సీన్స్ కి ఉపయోగించిన సౌండ్ మరియు సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా చాలా ప్రేరణ పొందాను...అద్భుతమైన ప్రదర్శనలంటూ నటి నటులను చిత్ర బృందాన్ని పొగిడారు. మిస్టర్ చోప్రా, అబ్బా ఎలాంటి మూవీ తీశారండి. (థాంక్యూ ఫర్ ది బ్రిలియన్స్) ఇలాంటి సినిమా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపి...తాను ఈ సినిమా ద్వారా గాఢంగా ప్రేరణ పొందినట్లు తెలిపారు.

విజయ్ దేవేరుకోండ తన ఎక్స్ ఖాతాలో

‘పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న ప్రతి తల్లి, తండ్రి, మరియు అమ్మమ్మలకు... మరొకరికి స్ఫూర్తినిచ్చే ప్రతి దుష్యంత్ సార్‌కి. పాండే ఇక గౌరీ భాయ్ వంటి ప్రతి స్నేహితులకి. శ్రద్ధా లాంటి అమ్మాయికి...బయట ఉన్న ప్రతి మనోజ్‌కి...నా ప్రేమ, ప్రార్థనలను అందిస్తున్నాను. మీరు ప్రతి పోరాటాన్ని అధిగమించి విజయం సాధించండి. 12th Fail చిత్ర బృందానికి అభినందనలు అని రాసుకొచ్చారు విజయ్‌.