అమీర్ ఖాన్ మెహందీ పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అమీర్ ఖాన్, రీనా దత్తా దంపతుల కుమార్తె ఇరా ఖాన్ కు ఫిట్నెస్ కోచ్, కన్సల్టెంట్, అథ్లెట్ అయిన నుపుర్ శిఖారేతో పెళ్లి జరిగింది. ఇరా ఖాన్ మరియు నుపుర్ శిఖారే ప్రేమించుకున్నారు.
ఇరా ఖాన్ ఇటీవల తన ప్రియుడు నుపుర్ శిఖారేను జనవరి 10న వివాహం చేసుకుంది. జనవరి 3న ముంబైలో రిజిస్టర్డ్ మ్యారేజ్ వేడుక జరిగింది. ఈ జంట ఉదయ్ పూర్ లో వైట్ వెడ్డింగ్ జరిగింది.
తాజాగా ఇరా ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. మొదటి రెండు ఫోటోల్లో ఆమిర్ చేతిలో మెహందీని ప్రదర్శిస్తూ కనిపించారు. ఆయన కుమార్తె మణికట్టుపై టాటూ కూడా ఉంది. 'సన్, స్టార్ అండ్ మూన్' అంటూ కూతురి చేతిపై ఉన్న టాటూ మాదిరిగానే అమీర్ తన చేతికి మెహందీ పెట్టుకున్నారు.
మూడో ఫొటోలో అమీర్ ఇరా బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.